అయినవిల్లి (M) వీరవల్లిపాలెం రంగనాయక స్వామి దేవస్థానం మాజీ ఛైర్మన్ ముద్రగడ సత్తిరాజు నాయుడు (65) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. ఆలయ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గ్రామస్థులు స్మరించుకున్నారు. ఆయన మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్తిరాజు నాయుడు మరణం తీరని లోటని పలువురు అన్నారు.