మస్కట్ నుండి సురక్షితంగా చేరిన అల్లవరం మహిళ

2280చూసినవారు
మస్కట్‌లో తీవ్ర పని ఒత్తిడి, అనారోగ్యంతో బాధపడిన అల్లవరం మండలం ఎన్. రామేశ్వరానికి చెందిన సి. హెచ్. ధనలక్ష్మి, కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల చొరవతో సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 'కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్' (KCM) అధికారులు స్పందించి, యజమాని, ఏజెంట్‌తో సమన్వయం చేసుకుని ఆమెను రప్పించారు. విదేశాలకు వెళ్లేవారు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారానే వెళ్లాలని నోడల్ అధికారి వి. సుబ్బారావు మంగళవారం సూచించారు. తమను ఆదుకున్న జిల్లా యంత్రాంగానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్