అమలాపురంలో అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు: అభిమానుల ఘన నివాళి

307చూసినవారు
అమలాపురంలో అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు: అభిమానుల ఘన నివాళి
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదినాన్ని అమలాపురంలో అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గీత ఆశ్రమంలో జరిగిన ఈ వేడుకల్లో, అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అనాధలకు అన్నదానం చేసి, గోవులకు దానా నిమిత్తం నగదు అందజేశారు. ఈ సామాజిక సేవ కార్యక్రమం ద్వారా అభిమానులు తమ అభిమాన హీరోపై ప్రేమను చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్