అమలాపురం: వృద్ధుడి కడుపులో 6 సెం. మీ. చేప ముల్లు తొలగింపు

1304చూసినవారు
అమలాపురం: వృద్ధుడి కడుపులో 6 సెం. మీ. చేప ముల్లు తొలగింపు
అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం అరుదైన శస్త్రచికిత్స జరిగింది. తీవ్రమైన కడుపునొప్పితో చేరిన 60 ఏళ్ల వృద్ధుడి కడుపులో 6 సెంటీమీటర్ల చేప ముల్లును డాక్టర్ రవితేజ గుర్తించారు. వైద్య బృందం వెంటనే ఆపరేషన్ చేసి ముల్లును విజయవంతంగా తొలగించింది. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నారు. కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్ రవితేజ సూచించారు. వైద్యుల సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు.

సంబంధిత పోస్ట్