ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో కొందరు వ్యక్తులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై అమలాపురానికి చెందిన 80 ఏళ్ల
జనసేన వీర మహిళ ముత్యాల మణెమ్మ పోలీసులను ఆశ్రయించారు. ఆదివారం అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సైలకు ఆమె ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు ఉన్నా, వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.