కొత్తపేట రెవెన్యూ కాలనీకి చెందిన దివ్యాంగుడు కుసుమ ప్రకాష్, చిన్నతనంలో పోలియో కారణంగా వికలాంగత్వం ఏర్పడిందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు మూడు చక్రాల మోటార్ సైకిల్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఎంఏ చదువుకున్న తనకు ఉద్యోగానికి వెళ్లేందుకు మోటార్ సైకిల్ అవసరమని ఆయన బుధవారం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.