అమలాపురం: కలెక్టర్ చొరవతో సేఫ్ గా ఇంటికి

889చూసినవారు
అమలాపురం: కలెక్టర్ చొరవతో సేఫ్ గా ఇంటికి
ఉపాధి కోసం ఖతర్ వెళ్లి యజమానుల వేధింపులు, ఆహార సమస్యలతో ఇబ్బందులు పడిన కొమరాడకు చెందిన కనకదుర్గ సురక్షితంగా స్వగ్రామం చేరుకున్నారు. ఆమె దీనస్థితిని భర్త నాగరాజు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ మహేష్ కుమార్ తక్షణమే స్పందించి, దౌత్య మార్గాల ద్వారా ఆమెను స్వదేశానికి రప్పించడంతో బాధితురాలు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్