అమలాపురం పరిధిలోని కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన భార్య లక్ష్మి శుక్రవారం కన్నీటిపర్యంతమయ్యారు. నిందితులైన గంగుమళ్ల కాసుబాబు, అడబాల శంకర్ లకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ లు తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.