అమలాపురం పురపాలక సంఘానికి చెందిన మంచినీటి చెరువులో చేపలు పట్టే సమయంలో కొన్నింటిని వదిలేయడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ఆదివారం వెంటనే చర్యలకు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ కాంట్రాక్టర్, సిబ్బంది కలిసి చెరువు ప్రాంతాన్ని శుభ్రపరిచారు. ఈ చర్యలతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.