ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు అమలాపురంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను 'తెలుగునాడు'గా మార్చాలని కోరారు. 'ఆంధ్రప్రదేశ్' అనేది తెలుగు మాట కాదని, స్వర్గీయ ఎన్టీఆర్ ఆకాంక్ష మేరకు ఈ పేరు మార్పును సాకారం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.