అమలాపురం మండలం కొంకాపల్లి కనకదుర్గమ్మ గుడి వద్ద గురువారం రాత్రి ఒక ద్విచక్ర వాహనం మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. గుడి వద్ద బైక్ నిలిపి లోపలికి వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చేలోపే బైక్ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో గుడిపై ఉన్న బోర్డుతో పాటు పక్కనే ఉన్న లాడ్జ్ బోర్డు కూడా కాలిపోయాయి.