ఉప్పలగుప్తం మండలం నంగవరంలో ఆదివారం పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7,190 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడి పందేలు వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ఎస్ఐ ఎస్. కె. జానీ బాషా హెచ్చరించారు.