అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఏడాది మద్యం అమ్మకాలు 5% పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,048.181 కోట్ల మద్యం విక్రయాలు జరగగా, 2025-26లో రూ.1,099.49 కోట్లకు చేరాయి. ఐఎంఎల్ కేసుల అమ్మకాలు 11% పెరిగి 14,86,181కు, బీరు కేసుల అమ్మకాలు 70% పెరిగి 7,73,668కు చేరుకున్నాయని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.