ఆదివారం ఉప్పలగుప్తం ఎస్ఐ జానీ బాషా తెలిపిన వివరాల ప్రకారం, ఎస్. యానం బీచ్ వద్ద మోటార్ సైకిల్ దొంగతనంపై కేసు నమోదు చేశారు. ఈ నెల 26న అయినవిల్లి మండలం మాగంకు చెందిన కుంచే హేమ మురారి బీచ్‌కు వచ్చి, అక్కడ పార్కింగ్ చేసిన తన బైక్ దొంగిలించబడిందని ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.