కోనసీమలో ముగిసిన జీవశాస్త్రం పరీక్ష.. 99. 68 శాతం హాజరు నమోదు

151చూసినవారు
కోనసీమలో శనివారం జరిగిన పదో తరగతి జీవశాస్త్రం వార్షిక పరీక్షకు 99.68 శాతం హాజరు నమోదైనట్లు డీఈవో పి. నాగేశ్వరరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 19,248 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 19,203 మంది, 31 మంది ప్రైవేటు విద్యార్థులకు 14 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 62 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్