వేసవి తాపం పెరగడంతో చల్లదనం కోసం పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. గురువారం ఇందుపల్లి గ్రామంలోని శిష్ట సుందర రామయ్య ఇంట్లోకి ప్రమాదకరమైన నల్లత్రాచు ప్రవేశించింది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ అక్కడికి చేరుకుని, పామును చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఇళ్లలోని బాత్‌రూమ్‌లు, చీకటి ప్రదేశాలను తనిఖీ చేసుకున్నాకే వెళ్లాలని స్థానికులు సూచిస్తున్నారు.