అమలాపురం రూరల్ పరిధిలోని ఇందుపల్లిలో బుధవారం తీర్థయాత్రలకు వెళ్లిన ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పుల్లెల సర్వేశ్వరశర్మ కుటుంబం ఈనెల 18న ఇంటికి తాళం వేసి యాత్రకు వెళ్లగా, దొంగలు తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడి బీరువాలో దాచిన 26 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 12 వేల నగదు, రూ. 80 వేల విలువైన వస్తువులను అపహరించారు. స్థానికుల సమాచారంతో దొంగతనం బయటపడగా, ఎస్సై వై. శేఖర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.