ఎర్ర వంతెనపై కూలిన ఫుట్‌పాత్

162చూసినవారు
ఎర్ర వంతెనపై కూలిన ఫుట్‌పాత్
అమలాపురం ఎర్ర వంతెనపై ఫుట్‌పాత్ సిమెంట్ బల్లలు విరిగిపోయి, కిందికి దిగబడిపోవడంతో పాదచారులు నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ వంతెనపై ఫుట్‌పాత్ అధ్వానంగా మారడంతో వృద్ధులు, చిన్నపిల్లలు జారిపడి గాయాలపాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, పాదచారులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్