అమలాపురం పెళ్లిళ్ల వెంకన్న కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధం

125చూసినవారు
అమలాపురంలోని మహిపాలవీధిలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి (పెళ్లిళ్ల వెంకన్న) కళ్యాణ మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరగనుంది. ఆలయ కమిటీ చైర్మన్ కంచిపల్లి అబ్బులు ఆధ్వర్యంలో ఈ వేడుకకు సర్వం సిద్ధం చేశారు. విద్యుత్ అలంకరణలతో ఆలయాన్ని, వివిధ రకాల పండ్లతో కళ్యాణ వేదికను సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి ఎదుర్కోలు వేడుక ఘనంగా నిర్వహించారు. శనివారం జరగబోయే ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలిరావాలని కోరారు.

సంబంధిత పోస్ట్