రొయ్యల చెరువులుగా మారిన భూములపై కలెక్టరేట్ ఎదుట ఆందోళన

470చూసినవారు
రొయ్యల చెరువులుగా మారిన భూములపై కలెక్టరేట్ ఎదుట ఆందోళన
కోనసీమ జిల్లాలో సుమారు 2,000 ఎకరాల స్వాంప్ భూములను ఆక్రమించి రొయ్యల చెరువులుగా మార్చడాన్ని నిరసిస్తూ రైతులు అమలాపురం కలెక్టరేట్ ఎదుట గురువారం భారీ నిరసన చేపట్టారు. కొల్లేరు సరస్సు పరిరక్షణ స్ఫూర్తితో కోనసీమను కాపాడాలని రైతులు కోరుతున్నారు. ఈ నిరసనలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, టిడిపి నాయకులు, అముడా చైర్మన్, పలువురు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్