ముంపు సమస్యపై అమలాపురంలో రైతుల పోరు

777చూసినవారు
కోనసీమ రైతు పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్ద గురువారం రైతులు నిరసన తెలిపారు. కూనవరం, రామేశ్వరం డ్రైన్ల పరిధిలోని స్వాంప్ భూముల ఆక్రమణల వల్ల 40 వేల ఎకరాల పంటలు నీట మునుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఆక్రమణలు తొలగించి, టైడల్ బ్యాంకులు పటిష్టం చేయాలని, ముంపు నీటిని గోదావరిలోకి మళ్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్