ఐ.పోలవరం: రోడ్డు ప్రమాదంలో టెక్నీషియన్‌కు తీవ్ర గాయాలు

1426చూసినవారు
ఐ.పోలవరం బైపాస్ రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అమలాపురానికి చెందిన ఓ టెక్నీషియన్ తీవ్రంగా గాయపడ్డాడు. బైక్‌పై వెళ్తుండగా కారు బలంగా ఢీకొట్టడంతో సదరు యువకుడి తలకు, చేతులకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కారు వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్