కోమసీమ కలెక్టర్ చొరవ: ఖతార్ వేధింపుల నుండి మహిళకు విముక్తి

369చూసినవారు
కోమసీమ కలెక్టర్ చొరవ: ఖతార్ వేధింపుల నుండి మహిళకు విముక్తి
ఉప్పలగుప్తం మండలానికి చెందిన మల్లాడి జయలక్ష్మి ఖతార్‌లో నకిలీ ఏజెంట్ ద్వారా వెళ్లి వేధింపులకు గురయ్యారు. ఆమె పిల్లలు 'కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్'ను ఆశ్రయించడంతో, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల ఆదేశాల మేరకు అధికారులు స్పందించి, ఏజెంట్‌తో మాట్లాడి జయలక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి రప్పించారు. విదేశాలకు వెళ్లేవారు నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మైగ్రేషన్ సెంటర్ సలహాలు తీసుకోవాలని అధికారులు బుధవారం సూచించారు.

సంబంధిత పోస్ట్