కోనసీమ: వాడపల్లిలో అద్భుత దృశ్యం..!

4చూసినవారు
కోనసీమ: వాడపల్లిలో అద్భుత దృశ్యం..!
కోనసీమలోని తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినాన అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గురువారం ఉదయం సూర్యోదయ కిరణాలు నేరుగా ఆలయ శిఖరాన్ని తాకుతూ దర్శనమివ్వడంతో భక్తులు పరవశించిపోయారు. ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయిన ఈ సుందర దృశ్యాన్ని భక్తులు తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించిన భక్తులు స్వామివారి కృపగా భావిస్తూ తన్మయత్వం చెందారు.

సంబంధిత పోస్ట్