డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (A P W J F) నూతన కార్యవర్గం సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా, జిల్లా ప్రింట్ మీడియా నూతన అధ్యక్షులుగా మట్టపర్తి శ్రీనివాస్ (సాక్షి) మరియు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా కడలి రాజు (సాక్షి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని పి. గన్నవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మరియు ఇతర పెద్దలు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు విలేకరులు పాల్గొన్నారు.