కోనసీమ: 'పరిశ్రమల అనుమతుల్లో జాప్యం వద్దు'

996చూసినవారు
కోనసీమలో పారిశ్రామికాభివృద్ధి, స్వయం ఉపాధి లక్ష్యంగా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం జరిగింది. ఎంఎస్ఎంఈ పార్క్ పనులను వేగవంతం చేయాలని, కొబ్బరి పీచు ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలని, పర్యావరణ హితమైన విస్తరాకుల తయారీ, సముద్రపు నాచు పెంపకాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఖాదీ, చేనేత ఉత్పత్తుల విక్రయాలకు ఆర్టీసీ డిపోలు, రైతు బజార్లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సింగిల్ డెస్క్ ద్వారా పరిశ్రమలకు నిర్ణీత గడువులోగా అనుమతులు మంజూరు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్