చికిత్స పొందుతూ కోనసీమ వాసి మరణం - గొల్లప్రోలులో ప్రమాదం

1948చూసినవారు
చికిత్స పొందుతూ కోనసీమ వాసి మరణం - గొల్లప్రోలులో ప్రమాదం
గొల్లప్రోలు మండలం ఎ. కె. మల్లవరంలో ట్రాక్టర్ బోల్తా పడి తీవ్రంగా గాయపడిన డ్రైవర్ చిల్లా వెంకటరమణ (45) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. సీతారాంపురానికి చెందిన ఆయన, వ్యవసాయ పనుల నిమిత్తం ఎ. కె. మల్లవరం వచ్చారు. ఈ నెల 17న తిరిగి వెళ్తుండగా, ట్రాక్టర్ రోడ్డు ఎక్కించే క్రమంలో బోల్తా పడింది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స విఫలమవడంతో మరణించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్