అమలాపురంలోని మహిపాల వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా, శ్రీ కూచిపూడి నృత్య నికేతన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం, అమలాపురం శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనను అద్భుతంగా అందించింది. ఈ ప్రదర్శనను భక్తులు ఎంతో ప్రశంసించారు. ఆలయ చైర్మన్ కంచపల్లి అబ్బులు, ఈవో సత్య కుమార్ చిన్నారులను ఆశీర్వదించి బహుమతులు అందజేశారు. ఈ నృత్య ప్రదర్శన స్వామి సన్నిధిలో జరిగింది.