డ్రగ్స్ రహిత జిల్లాగా కోనసీమను తీర్చిదిద్దుదాం: కలెక్టర్

704చూసినవారు
మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో, యువత వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కలెక్టర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో 'యాంటీ డ్రగ్ క్లబ్స్' ఏర్పాటు చేయాలని, గంజాయి రవాణాపై కఠిన నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిని సన్మార్గంలో నడిపించాలన్నారు. వ్యసనపరులను బాధితులుగా గుర్తించి పునరావాసం కల్పించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్