నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కోనసీమ జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. డిసెంబరు 30, 31 తేదీల్లో అమలాపురం డిపో నుంచి సుమారు రూ.15 కోట్ల విలువైన మద్యం స్టాక్ దుకాణాలకు సరఫరా చేయగా, కేవలం ఆ రెండ్రోజుల్లోనే రూ.10 కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు జరిగే అమ్మకాలు, పండగ వేళ ఐదింతలు పెరగడం విశేషం.