ప్రపంచ డిమెన్షియా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురం ఏరియా హాస్పిటల్ డి-అడిక్షన్ సెంటర్, జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం ఆధ్వర్యంలో ఈదరపల్లి ఎస్కే ఓల్డ్ ఏజ్ హోమ్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ పి. సౌమ్య వృద్ధులకు మతిమరుపు (డిమెన్షియా)పై అవగాహన కల్పించడంతో పాటు క్లినికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి, అవసరమైన వారికి మందులు సూచించారు. అనంతరం మానసిక సమస్యలతో పాటు ధూమపాన అలవాటు ఉన్న వృద్ధులకు ధూమపానం వల్ల కలిగే నష్టాలు వివరించారు. డి అడిక్షన్ సెంటర్ లో అందించే సేవలు వివరించారు.