కొత్త తరహా సైబర్ మోసాలు

139చూసినవారు
కొత్త తరహా సైబర్ మోసాలు
అంబాజీపేట, పుల్లేటికుర్రు ప్రాంతాల్లో సైబర్ నేరగాళ్లు కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. మీ పిల్లలకు రూ.35వేల స్కాలర్‌షిప్ మంజూరైందని, ఫోన్‌పే, గూగుల్ పే నెంబర్లు చెప్పాలని నమ్మబలికి, కొంతమంది తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. ఖాతాలో కనీసం రూ.5 వేల బ్యాలెన్స్ ఉండాలని నిబంధన పెట్టడంతో అనుమానం వచ్చిన బాధితులు ఉపాధ్యాయులను సంప్రదించి మోసాన్ని గుర్తించారు.