ఇమ్మిడివరప్పాడులో ఓవర్ హెడ్ ట్యాంక్ శిలాఫలకం ధ్వంసం

1075చూసినవారు
అమలాపురం మండలం ఇమ్మిడివరప్పాడులో గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన కొద్ది రోజులకే, శంకుస్థాపన శిలాఫలకాన్ని కూడా దుండగులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్