కడలి గ్రామంలోని శ్రీపార్వతీ కపోతేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి శుక్రవారం అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా, ఒక పావురం స్వామి సన్నిధిలోకి వచ్చి కొంతసేపు అక్కడే నిలవడం భక్తులకు విశేషంగా కనిపించింది. దీనిని భక్తులు శుభసూచకంగా భావించి, దైవానుగ్రహంగా పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తిరసంతో నిండిపోయింది. ఈ అరుదైన సంఘటనను చూసి భక్తులు తన్మయత్వం చెందారు.