ఉప్పలగుప్తం మండలంలో నేడు విద్యుత్తు నిలిపివేత

767చూసినవారు
ఉప్పలగుప్తం మండలం చినగాడవిల్లిలో విద్యుత్తు పనుల నిమిత్తం గురువారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనుందని ఈఈ కె. రాంబాబు తెలిపారు. చినగాడవిల్లి, పెదగాడవిల్లి, మునిపల్లి గ్రామాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా ఉండదని ఆయన వివరించారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్