రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి: వైసీపీ నాయకులు

620చూసినవారు
రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి: వైసీపీ నాయకులు
డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం అమలాపురంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ మరియు మాజీ శాసనసభ్యురాల పాముల రాజేశ్వరిదేవి మాట్లాడుతూ, పాత్రికేయ విలువలను తాకట్టు పెట్టి, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం రాధాకృష్ణ అహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ABN రాధాకృష్ణ మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you