పాసర్లపూడికి చెందిన ఆదర్శ రైతు ఉప్పే బాలాజీ పెంచుతున్న 20 ఏళ్ల నాటి రాజస్థాన్ రాఠీ ఆవు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఆవు రోజుకు 20 లీటర్ల పాల దిగుబడిని అందిస్తూ బాలాజీ కుటుంబానికి అండగా నిలుస్తోంది. మంచి దిగుబడినిస్తున్న ఈ మూగజీవాన్ని ఎంతో మమకారంతో పోషిస్తున్నట్లు బాలాజీ గురువారం సంతోషం వ్యక్తం చేశారు.