అమలాపురంలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం స్థానిక వెంకటరమణ థియేటర్ వద్ద అభిమానులు కేక్ కటింగ్ చేసి, బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ సుధా చిన్న,
చిరంజీవి యువత నాయకులు నల్లా చిట్టిబాబు, ఏడిద శ్రీను, నల్లా నాయుడు, మెగా యూత్ ఫోర్స్ అమలాపురం టౌన్ కన్వీనర్ గోకరకొండ సాయిధర్, జాయింట్ కన్వీనర్ చిక్కం బాలాజీ, మరియు పలువురు మెగా అభిమానులు పాల్గొన్నారు.