రావులపాలెంకు చెందిన కాదులూరి సత్యశ్రీ, బీటెక్ తర్వాత వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకుని, గ్రూప్స్ సాధించాలనే లక్ష్యంతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. టీవీ మెకానిక్ తండ్రి వీర వెంకట సత్యనారాయణ, తల్లి కాశీ అన్నపూర్ణల ప్రోత్సాహంతో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన ఆమెను స్థానికులు అభినందిస్తున్నారు. పట్టుదలతో శ్రమిస్తే విజయం తప్పక వరిస్తుందని ఆమె నిరూపించారు.