విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏరియా హాస్పిటల్ అమలాపురం డి-అడిక్షన్ సెంటర్, ఈగల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు సూచించారు. గొల్లవెల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి కొనుగోలు, విక్రయం, వినియోగం, సరఫరా వల్ల కలిగే నష్టాలు, NDPS చట్టం, సెక్షన్లు, శిక్షలు, ఆపరేషన్ సేఫ్ జోన్, సైబర్ క్రైమ్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే డి-అడిక్షన్ సెంటర్ అందించే చికిత్స, కౌన్సెలింగ్ & పునరావాస సేవలను వివరించారు. కార్యక్రమంలో సెంటర్ కోఆర్డినేటర్ శ్రీనుబాబు, ఈగల్ పోలీస్ సిబ్బంది రఘు, సత్య, Hm G. కనకదుర్గ, PET ఫణి, టీచర్స్ పాల్గొన్నారు.