అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కోనసీమ కలెక్టర్ మహేష్

2313చూసినవారు
అమలాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, జేసీ వైఖోం నైదియాదేవి సుమారు 220 అర్జీలను స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. అర్జీదారుడు నూటికి నూరు శాతం సంతృప్తి చెందేలా గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. అధికారులు మానవీయ కోణంలో, అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించాలని జేసీ సూచించారు.

సంబంధిత పోస్ట్