వంతెన పనులతో లొల్లలో గంటల తరబడి ట్రాఫిక్ కష్టాలు

570చూసినవారు
వంతెన పనులతో లొల్లలో గంటల తరబడి ట్రాఫిక్ కష్టాలు
ఆత్రేయపురం మండలం వాడపల్లి-లొల్ల వంతెనపై శనివారం అభివృద్ధి పనుల కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. లొల్ల లాకుల అభివృద్ధి పనులు జరుగుతుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు గంటల తరబడి నరకం చూశామని ఆరోపిస్తున్నారు. వాహనాల రద్దీతో వంతెన పరిసరాలు స్తంభించగా, అధికారులు పరిస్థితిని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్