వాడపల్లి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు "మనమిత్ర" వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు తెలిపారు. 95523-00009 వాట్సాప్ నంబర్ ద్వారా ఆలయానికి సంబంధించిన వివిధ సేవలు, సదుపాయాలు భక్తులు సులభంగా పొందవచ్చని గురువారం ఆయన వెల్లడించారు. ఎక్కువ మంది భక్తులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.