జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి ఆదేశించారు. శనివారం అమలాపురంలో ఏఈఆర్‌ఓలు, ఎన్నికల సిబ్బంది శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేయాలని, నకిలీ, మరణించిన వారి ఓట్లను తొలగించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ వి. సుబ్బారావు పాల్గొన్నారు.