15వ రోజుకు చేరిన వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలు

6చూసినవారు
15వ రోజుకు చేరిన వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలు
కోనసీమలోని అమలాపురం తాసిల్దార్ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోరుతూ విఆర్ఏలు చేస్తున్న రిలే నిరాహార దీక్ష బుధవారం నాటికి 15 రోజులకు చేరుకుంది. ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రాకపోవడంతో దీక్షలు కొనసాగుతున్నాయని మండల వీఆర్ఏ సంఘం అధ్యక్షులు ఎం. లక్ష్మణరావు తెలిపారు. 10,500 వేతనంతో జీవనం ఎలా సాగించాలని వీఆర్ఏలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పేస్కేల్ అమలు చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్