వేధింపులే కారణమా? బండారులంక వివాహిత కేసులో ఇద్దరి అరెస్ట్

1229చూసినవారు
వేధింపులే కారణమా? బండారులంక వివాహిత కేసులో ఇద్దరి అరెస్ట్
అమలాపురం రూరల్ పరిధిలోని బండారులంక దంగేటివారిపాలెంలో వివాహిత కడలి సాయివెంకటజ్యోతి (24) ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ నెల 2న ఆమె తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోగా, మృతురాలి భర్త శిరీష్, మామ కడలి సింహాద్రిని బుధవారం అరెస్ట్ చేసినట్లు అమలాపురం పట్టణ సీఐ వీరబాబు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.