
తునిలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిక
తుని మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేజర్ పంచాయితీ తేటగుంట గ్రామానికి చెందిన సుమారు 200 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి, శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తేటగుంట టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, చేరిన వారందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని యనమల హామీ ఇచ్చారు.







































