ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 1.95 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని DPTO వై. ఎస్. ఎన్ మూర్తి బుధవారం తెలిపారు. జిల్లాలోని 4 డిపోల నుంచి మొత్తం 2.89 కోట్ల మంది ప్రయాణించగా, అందులో 68 శాతం మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. పథకం అమలులోకి వచ్చి 225 రోజులు పూర్తయింది, మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.