తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రామవరం లో బుధవారం అంగన్వాడి సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, సీడీపీఓ, సూపర్వైజర్లను సత్కరించి, వారి సేవలను అభినందించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న పోషకాహారం, ఆరోగ్యం, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పోషణ మాసం సందర్భంగా సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.