ఒరిగిన కాలువ రెయిలింగ్.. పొంచి ఉన్న ప్రమాదం

422చూసినవారు
బిక్కవోలు మండలంలోని కొంకుదురు ప్రభుత్వ హైస్కూల్‌కు వెళ్లే దారిలో కాలువ రెయిలింగ్ ఒక పక్కకు ఒరిగిపోయింది. దీనివల్ల వందలాది మంది ప్రజలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై వెంటనే స్పందించి, మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్